Homeతెలుగు Newsఆయన రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదు: పవన్‌

ఆయన రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదు: పవన్‌

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోవడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం దేనికీ ఉపయోగపడలేదని విమర్శించారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన.. జనసేన అండ లేకుంటే తెలుగుదేశం నేడు విపక్షంలో కూర్చుని ఉండేదని వెల్లడించారు. నాడు ఏమీ ఆశించకుండా అనుభవం ఉన్న నేత సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని మద్దతు ఇచ్చామని తెలిపారు.

10 15

కోనసీమ ఆత్మగౌరవాన్ని టీడీపీ , వైసీపీలు కాపాడలేకపోయాయని తెలిపారు. జనసేన కోనసీమ ఆత్మగౌరవాన్ని కాపాడిందని వివరించారు. మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజించి లబ్ధి పొందే వారు ఎక్కువైపోయారని తెలిపారు. దేశ ప్రజలంతా ఒక్కటి కావాలనుకునే పార్టీ జనసేన అని ఆయన పేర్కొన్నారు. ఓట్లు వేయించుకొని ప్రజలను నాయకులు గాలికి వదిలేస్తున్నారని తెలిపారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకే రాజకీయాల్లోకి వచ్చా అని స్పష్టం చేశారు. మన హక్కులు సక్రమంగా పొందాలంటే జనసేనను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu