HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ని కలిసిన 'హరి హర వీరమల్లు' టీమ్‌

పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన ‘హరి హర వీరమల్లు’ టీమ్‌

pawan kalyan krish Harihar

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే కొద్దిభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత పునః ప్రారంభంకానుంది. ఈ మేరకు హీరో పవన్‌ కల్యాణ్‌, దర్శకనిర్మాతలు సమావేశమయ్యారు. తదుపరి షెడ్యూల్స్‌ చిత్రీకరణ గురించి చర్చించారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథ ఇది. ఈ సినిమా కి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ – హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ – మలయాళ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఇవి పూర్తయ్యాక హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu