HomeTelugu Trendingనా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను: పవన్‌ కళ్యాణ్‌

నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను: పవన్‌ కళ్యాణ్‌

5 20దాదాపు ఐదు నెలల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉండగా, నిన్ననే హైదరాబాద్, శిల్పకళా వేదికలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న ఆయన, ఆపై వరుస ట్వీట్లు పెట్టారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కలిశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్స్‌లో పవన్‌.. బిగ్‌బిని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పవన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఆరాధ్యమూర్తి అమితాబ్‌ బచ్చన్‌ని ‘సైరా’ సెట్స్‌లో కలిశాను. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుంది’ అని పేర్కొన్నారు. ‘సైరా’ సినిమాకి పవన్‌ వాయిస్‌ ఓవర్‌ అందించిన సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌.. చిరుకు గురువుగా కీలక పాత్ర పోషించారు. అక్టోబర్‌ 2న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu