HomeTelugu Trendingమరో దర్శకుడిని లైన్‌లో పెట్టిన పవన్‌ కళ్యాణ్‌

మరో దర్శకుడిని లైన్‌లో పెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Pawan kalyan movie with gopపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీఎంట్రీ తరువాత నటిస్తున్న తొలి చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలా ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వరుస సినిమాలను ఒప్పుకున్న పవన్‌ ఇప్పుడు మరో దర్శకుడిని కూడా లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో పవన్ సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం గోపీచంద్ ప్రస్తుతం స్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అని సమాచారం. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని రవితేజతో ‘క్రాక్’ అనే సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu