HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా.. వీడియో

పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా.. వీడియో

Pawan kalyan New Movie anno

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ తరువాత వరస సినిమాలతో బీజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో నటిస్తున్న పవన్‌ .. ఆ తరువాత క్రిష్‌, హరీశ్‌ శంకర్‌లతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌ సంతాకం చేశారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాగర్‌ కె.చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఓ సినిమాలో పవన్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దసరా సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటిస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌’ అని పేర్కొంది. తమన్‌ సంగీతం అందించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu