HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌- సుజీత్‌ సినిమా ప్రారంభం... పిక్స్‌ వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌- సుజీత్‌ సినిమా ప్రారంభం… పిక్స్‌ వైరల్‌

Pawan kalyan 1
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో సుజీత్‌ దర్శకత్వం వహించనున్న ‘OG’ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రకటన పోస్టర్‌తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సాహో వంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకుని సుజీత్‌ ఈ సినిమాను సిద్ధం చేశాడు. పైగా పవన్‌కు సుజీత్‌ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా ప్రారంభమైయ్యాయి.

Pawan kalyan Stylish look f

అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్‌ ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్‌కు నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్.. సురేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్‌ రిలీజ్‌ చేసారు. పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేమ్‌ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, నటీనటులు తదితర విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu