HomeTelugu Trendingపవన్ కల్యాణ్ 'బ్రో' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

పవన్ కల్యాణ్ ‘బ్రో’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

Bro movie second single
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. . సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదల చేశారు. ‘జాణవులే నెరజాణవులే’ అంటూ సాగే ఈ రొమాంటిక్ గీతాన్ని సాయిధరమ్ తేజ్, కేతికా శర్మపై చిత్రీకరించారు.

తమన్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను తమన్, ప్రణతి ఆలపించారు. ఈ పాటను తిరుపతిలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.

బ్రో మూవీ ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

‘బ్రో’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన మైడియర్ మార్కండేయ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. పవన్, సాయిధరమ్ తేజ్‌పై చిత్రీకరించిన ఆ పాట లిరికల్ వీడియోకు యూట్యూబ్‌లో వ్యూస్ భారీ స్థాయిలో వస్తున్నాయి.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu