HomeTelugu Trendingవకీల్‌సాబ్‌ నుంచి పవన్‌ లుక్‌ లీక్‌..

వకీల్‌సాబ్‌ నుంచి పవన్‌ లుక్‌ లీక్‌..

2 29
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వ‌కీల్‌సాబ్’. ఈ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్‌లో పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్లు ఫొటో అది.

పవ‌న్‌ క‌ల్యాణ్ వాదనలు వినిపిస్తుండగా పక్కనే నటి అంజ‌లి కూర్చొని ఉంది. కోర్టులో వాదనలు వినడానికి వచ్చిన మరి కొందరూ ఇందులో కనపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది. అంజ‌లితో పాటు నివేదా థామ‌స్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu