
వైసీపీ మీడియా టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉండకూడదు. అందుకు ఏం చేయాలో ? ఎలాంటి కథనాలు అల్లాలో ? అని వైసీపీ మీడియా బృందం చర్చలు జరుపుతూ మరీ…ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టిస్తోంది. అందులో భాగంగా వచ్చిన వార్తే.. ‘సిఎమ్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్!’ అనే ఆర్టికల్. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ ప్రముఖ మీడియా అధినేతను కలిసారట. సుమారు అయిదు గంటల పాటు వారి సమావేశం సాగిందట. (మరీ ఈ ఆర్టికల్ రాయించిన వ్యక్తి దగ్గర ఉండి చూశాడా ? లేక, ఆయన ఏమైనా ‘అంతర్యామి’నా). పైగా ఈ సమావేశంలో ఆంధ్రలో రాజకీయ పరిస్థితులు అన్నీ కూలంకషంగా చర్చించారట. తెలుగుదేశం – జనసేన కలిసి పోటీ చేయడంతో పాటు, పవన్ కళ్యాణ్ ను ముందే సిఎమ్ అభ్యర్థిగా ప్రకటించాలన్నది ఆ పెద్దాయన సంచలన సూచన అట. పవన్ ఫ్యాన్స్ లో ఈ ఆలోచనను పుట్టించడానికి ఈ ఆర్టికల్ వండి వార్చారు.
పైగా పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు రెండు వందలశాతం గ్యారంటీ వుంటుందని ఆ పెద్దాయన చంద్రబాబుకు వివరించారట. పవన్ పార్టీ నిర్మాణం, రాజకీయ నడక గురించి తెలిసిన ఏ పెద్దాయన అయినా ఇలాంటి సూచన చేస్తాడా ?, పవన్ లో లేనిపోని ఆశలు కల్పించి…చంద్రబాబుకు ఎలాగైనా దూరం చేయాలి అనేదే వైసీపీ మీడియా టార్గెట్ గా పెట్టుకుంది. పవన్ తో కేవలం ఇరవై, ముఫై సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటే సరిపోదని కూడా వీళ్ళే చెబుతున్నారు. జనసేన అభిమానులు ఆవేశ పరులు. రేపు పొత్తులో భాగంగా పవన్ సీఎం అభ్యర్థి అంటూ వాళ్ళను ఇప్పటి నుంచే మెంటల్ గా ఫిక్స్ చేస్తున్నారు.
నిజానికి పవన్ పార్టీ ఉన్న ఓట్ల శాతం 4 నుంచి 6 శాతం. కానీ టీడీపీకి ఉన్నది ప్రస్తుత అంచనా ప్రకారం 42 శాతం. రోజురోజుకు ఇంకా పెరుగుతుంది అని టాక్. ఇలాంటి నేపథ్యంలో పవన్ కి ఎందుకు సీఎం పదవి ఇస్తారు ?, దీనికి సదరు వైసీపీ మీడియా చెప్పిన వివరణ ఇలా ఉంది. పవన్ సీఎం అభ్యర్థి అని ప్రకటిస్తే తప్ప, పవన్ ఫ్యాన్స్ పార్టీ కోసం పని చెయ్యరు అట. మరీ గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి వ్యతిరేకంగానే కదా పోటీ చేసింది. అప్పుడు జనసైనికులు బాగా పని చేశారా ?, అప్పుడు వాళ్లంతా కనీసం పవన్ కళ్యాణ్ ను కనీసం ఎమ్యెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయారు. కాబట్టి.. తన బలం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి ? లాంటి విషయాల్లో పవన్ కి స్పష్టమైన అవగాహన ఉన్నట్టు ఉంది.
అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ వస్తున్నాడు. కాబట్టి.. వైసీపీ మీడియా చేసే విష ప్రచారం పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. అయినా, తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమాని అనుకునే ఆ పెద్దాయిన నుంచి ఇలాంటి సూచన వస్తుందని ఎవరూ నమ్మరు. కచ్చితంగా రాదు కూడా. కాబట్టి విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం అంటూ వైసీపీ చేసే విష ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రజలదే.













