
Bigg Boss 19 Update:
బిగ్ బాస్ 19 ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్! ఈసారి బిగ్ బాస్ 19 సీజన్ August 3న స్టార్ట్ కాబోతుంది. గత సీజన్ల మాదిరిగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కాదు, ముందుగానే వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ తారస్థాయిలో ఉంది.
ఈసారి ‘ఖత్రోన్ కే ఖిలాడి’ షో రద్దు కావడంతో రియాలిటీ షో మజాను మిస్ అయిన ప్రేక్షకులకు బిగ్ బాస్ ఓ బంపర్ ట్రీట్ కానుంది. బిగ్ బాస్ హోస్ట్ గా మళ్లీ సల్మాన్ ఖాన్ రాబోతుండగా, పాత సీజన్లలో అభిమానులకి నచ్చిన ఎలిమెంట్స్‌ని ఈసారి మళ్లీ తీసుకొస్తున్నారు.
సీక్రెట్ రూమ్ మళ్లీ వస్తుంది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అక్కడికి పంపబడతారు, అక్కడ నుంచి మిగతా కంటెస్టెంట్స్‌ను గమనించే అవకాశం ఉంటుంది. ఇక ఈసారి ఎలిమినేషన్ పూర్తిగా ఆడియెన్స్ వోటింగ్ ద్వారా జరగనుంది.
వారానికి అవసరమైన రేషన్ టాస్కుల ద్వారా సంపాదించాలి, అంటే హౌస్‌లో డబ్బా మళ్లీ మొదలవ్వబోతుంది అని చెప్పొచ్చు!
ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ విషయానికి వస్తే, ఇది ఇంకా అధికారికంగా బయటకురాలేదు కానీ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి:
అలిషా పంవార్
రాజ్ కుంద్రా
ధీరజ్ ధూపార్
మున్మున్ దత్తా
ఫ్లైయింగ్ బీస్ట్
కృష్ణా శ్రాఫ్
ఫైసల్ షేక్ (Mr. Faisu)
ఖుషి దూబే
అపూర్వా ముఖిజా (Rebel Kid)
డైసీ షా
రామ్ కపూర్
ఆరిష్ఫా ఖాన్
గౌతమీ కపూర్
ఇవి అఫీషియల్ కాదు కానీ ఇందులో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని టాక్.
ఈసారి బిగ్ బాస్ సీజన్ అన్ని సీజన్లలో ఎక్కువ రోజులు నడిచే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సీజన్‌తో పగలు రాత్రి డ్రామా మళ్ళీ స్టార్ట్ అవబోతోంది!
ALSO READ: Bigg Boss Telugu 9 లో ఎవరు ఎంటర్ అవుతున్నారు? లీక్‌డ్ లిస్ట్ షాక్!