HomeTelugu News'పిజ్జా2' రాబోతుంది!

‘పిజ్జా2’ రాబోతుంది!

తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుతో దక్కించుకుంటున్న డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్ర హక్కులను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీదున్న తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి తమిళంలో నటిస్తున్న చిత్రం ‘పురియత్ పుధీర్’. ఈ చిత్రాన్ని ‘పిజ్జా-2’ పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. ”ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతి ఈ చిత్రం ఎనిమిద హిట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్ర థ్రియేట్రికల్ ట్రైలర్‌ను విడుదలైన 48 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించడం విజయ్‌సేతుపతి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇదే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు”.

Recent Articles English

Gallery

Recent Articles Telugu