బన్నీ సినిమాపై బాలీవుడ్ హీరో ఆసక్తి!

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా మొదలవ్వక ముందే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అజయ్ దేవగన్ జీ స్టూడియోస్ వాళ్ళతో కలిసి ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం ప్రయత్నం చేస్తుండడం విశేషం.

తెలుగు, హిందీలతో పాటు మలయాళ వెర్షన్స్ మొత్తం కలిపి 24 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ బాలీవుడ్ హీరో ఇలా ఓ తెలుగు సినిమా పై ఇంత ఆసక్తి చూపడం, భారీ రేటుకి శాటిలైట్ రైట్స్ తీసుకోవడం ఊహకందని విషయం. సినిమా మొదలవ్వక ముందే ఈ రేంజ్ లో వ్యాపారం జరుగుతుంటే ఇక మొదలైన విడుదలకు వచ్చేప్పటికీ ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో.. చూడాలి!