Homeతెలుగు వెర్షన్'TJR సుధాకర్ బాబు' రాజకీయ గ్రాఫ్ ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఇదే

‘TJR సుధాకర్ బాబు’ రాజకీయ గ్రాఫ్ ?, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఇదే

Political graph of TJR Sudhakar Babu this is his situation in next election

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్, నేపథ్యం విషయానికి వస్తే.. ‘TJR సుధాకర్ బాబు’. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకమైన యూత్ కాంగ్రెస్ నాయకుడిగా వెలిగిన TJR సుధాకర్ బాబు పూర్తి పేరు ‘తలతోటి జయరత్న సుధాకర్ బాబు’. ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుధాకర్ బాబు నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎంబిఏ మరియు ఎల్ ఎల్ బి పూర్తి చేశారు. మరి ప్రస్తుతం ప్రజల్లో TJR సుధాకర్ బాబు పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో TJR సుధాకర్ బాబు గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ? తెలుసుకుందాం రండి. సుధాకర్ బాబు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యూ.ఐ లో రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ యువ విభాగం యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయి పదవులను అధిరోహించారు.

అనంతరం, TJR సుధాకర్ బాబు 2009 లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఐతే, 2011 లో జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని, జగన్ ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2019 లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కావాల్సిన వ్యక్తి అని సుధాకర్ బాబు అనుచరులు మొదటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆ ప్రచారంతోనే TJR సుధాకర్ బాబు జగన్ రెడ్డి కి దగ్గర అయ్యాడు. దాంతో సుధాకర్ బాబుకి జగన్ రెడ్డి 2019లో సంతనూతలపాడు నియోజకవర్గం టికెట్ ఇచ్చాడు.

గత ఎన్నికల్లో జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మిన ప్రజలు ఆ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం ప్రజలు TJR సుధాకర్ బాబును కూడా గెలిపించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా సుధాకర్ బాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో సుధాకర్ బాబు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబు పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ సుధాకర్ బాబుకి ఉందా ?, చూద్దాం రండి. సుధాకర్ బాబు తాను గెలిచిన తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. పైగా సుధాకర్ బాబు అవినీతి కూడా బాగా పెరిగిపోయింది అని ప్రస్తుతం అక్కడి ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది.

దీనికితోడు కొంత కాలంగా నియోజకవర్గం వ్యవహారాల్లో సుధాకర్ బాబుకి – స్థానిక నాయకులకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ బేధాభిప్రాయాలకు ప్రధాన కారణం.. సుధాకర్ బాబు గెలిచిన తర్వాత తానూ ఆర్ధికంగా లాభ పడుతున్నాడు గానీ, తన గెలుపుకు సహాయ పడిన స్థానిక నాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో జరిగే ప్రతి అవినీతి వెనుక.. డైరెక్ట్ గా సుధాకర్ బాబే ఉండటంతో.. స్థానిక నాయకులు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. ఇప్పటికే, స్థానిక నాయకులంతా ఏకం అయ్యారని.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబును ఓడించాలని వారంతా నిర్ణయించుకున్నారని.. అక్కడి ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో సుధాకర్ బాబు గెలవడం కష్టమే. ఆయన గ్రాఫ్ అండ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu