HomeTelugu Big Stories'పొన్నియిన్ సెల్వన్-2' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘పొన్నియిన్ సెల్వన్-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Ponniyin Selvan 2 confirms its release date Deets inside

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, త్రిష, జయం రవి, శరత్ కుమార్, పార్తీబన్, జయరామ్ తదితరులు నటించారు. చోళ రాజులకు .. పాండ్య రాజులకు మధ్య జరిగిన పోరాటమే ఈ సినిమా.

ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తెలుగులో అంతగా కనెక్ట్ కాకపోయినా, తమిళంలో మాత్రం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెకండ్ పార్టు ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీమ్ రెండో భాగానికి సంబంధించిన విడుదల తేదీను ప్రకటించింది. 2023 .. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ ముగిసిన దగ్గర నుంచే సెకండ్ పార్టు మొదలుకానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu