HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ సినిమా నుండి తప్పకున్న పూజా హెగ్డే!

పవన్‌ కళ్యాణ్‌ సినిమా నుండి తప్పకున్న పూజా హెగ్డే!

Pooja hegde exit on Bhavade
టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజ హెగ్డేకు చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ చేయనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలోను ఆమెనే హీరోయిన్ అనే హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేయనని పూజ హెగ్డే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. ఆ తరువాత తమిళ సినిమా ‘వినోదయా సితం’ రీమేకులో చేయనున్నారు. అందువలన ఆయన ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పడుతుంది.

ఒక వైపున త్రివిక్రమ్ – మహేశ్ సినిమాలో పూజ హెగ్డే చేయనుంది. మరో వైపున విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’ చేయనుంది. అంతేకాదు, హిందీ నుంచి కూడా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందువల్లనే తాను పవన్ ప్రాజెక్టును చేయలేనని హరీశ్ శంకర్‌తో పూజ హెగ్డేకు చెప్పినట్టుగా వినికిడి. మరి మేకర్స్ ఈ రూమర్స్ పై స్పష్టత ఇస్తారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu