యంగ్ హీరోతో పెళ్ళిచూపులు డైరెక్టర్!

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అన్ని ఏరియాల్లో హిట్ టాక్ రావడంతో మొదటి సినిమాతోనే దర్శకుడిగా పాపులర్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. అతడి తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా తరుణ్ భాస్కర్ యంగ్ హీరో నిఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తను రాసుకున్న కథను నిఖిల్ కు వినిపించడం దానికి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. కన్నడ బ్లాక్ బాస్టర్ హిట్ ‘కిరిక్ పార్టీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలానే నిర్మాత ఠాగూర్ మధు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. వీటితో పాటు ‘కార్తికేయ’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.