HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌కు జోడిగా పూజ హెగ్డే!

పవన్‌ కల్యాణ్‌కు జోడిగా పూజ హెగ్డే!

3 21

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. మరో వైపు రాజకీయాల్లో కూడా పవన్ చురుకు గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ గా వాస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వం లో ఓసినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్‌ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉందీ ఇటీవల ‘అల వైకుంఠపురం’ సినిమా తో సూపర్ హిట్ అందుకుంది ఈ బుట్ట బొమ్మ. ఇక హరీష్ శంకర్ గతం లో తెరకెక్కించిన ‘డీజే’, ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో పూజ నటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ అమ్మడుకి పవన్ కల్యాణ్‌ సినిమా అవకాశం వచ్చిందని టాక్.. ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu