HomeTelugu Trendingసల్మాన్‌ ఖాన్‌ సరసన పూజా హెగ్డే

సల్మాన్‌ ఖాన్‌ సరసన పూజా హెగ్డే

4 10

టాలీవుడ్‌లో మంచి జోష్‌ మీద ఉంది పూజా హెగ్డే. తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించింది. సినిమాతో ఈ ఏడాది పూజ హెగ్డే మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పూజా చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ప్రభాస్‌ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తుండగా, అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కనున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాల్లో నటిస్తోంది. ఈ బుట్టబొమ్మ హిందీ సినిమాల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘మొహెంజొదారో’, ‘హౌస్‌ఫుల్‌ 4’ వంటి చిత్రాల్లో నటించిన పూజా.. తాజాగా మరో భారీ ఛాన్స్‌ కొట్టేసింది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సల్మాన్‌ హీరోగా తెరకెక్కనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’లో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ విషయాన్ని నదియద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఎన్‌జీఈఎఫ్‌) సంస్థ మంగళవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

‘ఎన్‌జీఈఎఫ్‌ కుటుంబంలోకి పూజా హెగ్డేకు స్వాగతం పలుకుతున్నాం. సల్మాన్‌ నటిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తున్నారు’ అని ఎన్‌జీఈఎఫ్‌ ట్వీట్‌ చేసింది. పూజా నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’కు దర్శకత్వం వహించిన ఫర్హాద్‌ సామ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్‌ నదియద్‌వాలా కథ అందించారు. 2021 ఈద్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu