మరోసారి ఆమెకే ఓటు వేసిన అల్లు అర్జున్, త్రివిక్రమ్!

అల్లు అర్జున్… త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూడో సినిమా తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా జరుగుతున్నాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటె, ఈ సినిమాలో హీరోయిన్ కోసం అనేక పేర్లు పరిశీలించారు.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పేర్లు పరిశీలించి ఫైనల్ గా గతంలో చేసిన హీరోయిన్ను సెలక్ట్ చేశారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కు హిట్ ఇచ్చిన డీజే.. దువ్వాడ జగన్నాధం సినిమాలో బికినీతో మెరుపులు మెరిపించి పూజా హెగ్డే మరోసారి బన్నీతో జతకడుతోంది. రీసెంట్ గా పూజా హెగ్డే.. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. బన్నీ,త్రివిక్రమ్ తో పనిచేసిన అనుభవం ఉండటంతో.. మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఈ విషయాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.