HomeTelugu Trendingనాగ చైతన్య మరోసారి పూజా హెగ్డే రొమాన్స్‌!

నాగ చైతన్య మరోసారి పూజా హెగ్డే రొమాన్స్‌!

Pooja hegde to romance once
టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజ హెగ్డే వరస సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌ తో కలిసిని నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం విడుదల కావాల్సివుంది. ఆరేళ్ళ క్రితం ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఇక మరోసారి అక్కినేని నాగచైతన్యతో ఈ ముద్దుగుమ్మ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది.

‘మనం’ ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రంలో చైతు పక్కన మొత్తం ముగ్గురు హీరోయిన్లు వుంటారట. వారిలో మెయిన్ హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తాజాగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నటిస్తోంది పూజా హెగ్డే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu