HomeTelugu Trendingప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

ప్రభాస్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

11
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌ కోసం ఇన్నాళ్లు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ‘ప్రభాస్‌ 20వ సినిమా అప్‌డేట్‌ కావాలంటూ సోషల్‌మీడియాలో హంగామా చేశారు. కాగా ఎట్టకేలకు ‘సాహో’ తర్వాత ఆయన సినిమా అప్‌డేట్‌ విడుదలైంది. ఈ వారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ‘నమ్మొచ్చా గురువు గారూ..’ అంటూ సరదా కామెంట్లు చేశారు.

ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందని ఇటీవల ప్రచారం జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu