HomeTelugu Big Storiesశ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ అప్డేట్

శ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ అప్డేట్

Adipursh update sriramanava

ప్రభాస్ హీరోగా రామాయణం కథాంశంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. భారీ బడ్జెట్‌తో త్రీడీ వెర్షన్‌లో రూపొందుతోంది. ఇందులో సైఫ్ అలీఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 30 వేల ఏళ్ల క్రితం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారట. దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించి మరో తాజా అప్డేట్ రాబోతుంది. శ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఏప్రిల్ 21న ఓ ఆసక్తికర అప్డేడ్‌ను ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu