HomeTelugu Big Storiesపఠాన్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌!

పఠాన్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌!

prabhas movie with Siddhart

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులున్నాయి. అవన్నీ ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలే. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా సినిమాకి ప్రభాస్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ నయా బ్లాక్ బస్టర్ ‘పఠాన్‌’కు డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తాడని తెలుస్తోంది.

హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా వచ్చిన ‘పఠాన్’ భారీ విజయంతో పాటు వందల కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. కొన్నాళ్లుగా వరుస వైఫల్యాల్లో ఉన్న బాలీవుడ్ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌పై పడింది. ఆయన మాత్రం ప్రభాస్ తో తన సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా రూ.1500కోట్లు వెచ్చిస్తారనే ప్రచారం సాగుతుంది ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది.

ఈ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యెర్నేని బుధవారం దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ని కలిశారు. ‘పఠాన్‌’ అందుకున్న విజయానికి ఆయనను అభినందించారు. మైత్రీ మూవీస్ తో చిత్రం చేసేందుకు సిద్ధార్థ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు. సిద్ధార్థ్ ప్రస్తుతం హృతిక్ రోషన్ కథానాయకుడిగా ‘ఫైటర్’ చేయబోతున్నారు. ఇందులోనూ దీపికా పదుకొణె హీరోయిన్. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu