పాన్ ఇండియా హీరో ప్రభాస్ – ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సలార్’. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. బాక్సాఫీస్ వద్ద వసూల వర్షం కురిపిస్తుంది.
కాగా సినిమాలలో పాటల కంటే బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ స్కోర్)కే ఎక్కువ క్రేజ్ ఉంటుదన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించడానికి కూడా ముఖ్య కారణం బీజీఎం. రాఖీ ఎలివేషన్ అప్పుడు అయిన, గరుడ ఎంట్రీ సీన్ అయిన సినిమాను నడిపించింది బీజీఎం అని చెప్పకతప్పదు.
ఇదిలావుంటే.. తాజాగా వచ్చిన సలార్‌లో కూడా బీజీఎం ప్రధాన బలంగా పనిచేసింది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిచింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలమైన బీజీఎంను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
‘సౌండ్ ఆఫ్ సలార్’ పేరుతో ఈ వీడియోను విడుదల చేయగా.. రవి బస్రూర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ అద్భుతమైన సౌండ్ ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.