HomeTelugu Trendingప్రభాస్‌ చేతిలో 8 పాన్‌ ఇండియా సినిమాలు!

ప్రభాస్‌ చేతిలో 8 పాన్‌ ఇండియా సినిమాలు!

prabhas new 8 pan india mov
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా మరో 3 ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ కె, స్పిరిట్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ బ్రేక్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకులు సైతం ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు ముందుకొస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ క్రేజ్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రభాస్‌తో మైత్రీమూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఫుల్ యాక్షన్ కథాంశంతో పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించబోతున్నాడట. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా ప్రభాస్‌తో మరో మూవీ చేయబోతున్నాడట. దీనికి మారుతి దర్శకత్వంలో హర్రర్ కథాంశంతో తెరకెక్కబోతుందట. ఈ రెండూకాకుండా దిల్‌రాజుతో మరో కొత్త ప్రాజెక్టుకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 8 ప్రాజెక్టులున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu