HomeTelugu Newsమరో రికార్డు సృష్టించిన ప్రభాస్ సాహో

మరో రికార్డు సృష్టించిన ప్రభాస్ సాహో

14 2
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా హిందీ వెర్షన్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా టీవీల్లో ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన వ్యూయర్స్‌ వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సినిమాకు పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో కలిపి మొత్తం 8.33 మిలియన్‌ ఇంప్రెషన్స్‌ను సాహో సొంతం చేసుకుంది. దీంతో 2020లో 17వ వారంలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే ‘సాహో’ సినిమాను పలుమార్లు టీవీలో ప్రసారం చేసినప్పటికీ ఈ రికార్డు సృష్టించడం విశేషం. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, చుంకీ పాండే, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.433 కోట్లకుపైగా రాబట్టినట్లు అంచనా. ఇదే వారంలో ప్రసారమైన ‘బాహుబలి ది బిగినింగ్‌’ రెండో స్థానంలో నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu