HomeTelugu Trendingసలార్ సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి

సలార్ సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి

Salaar tickets

ప్రభాస్‌ తాజా చిత్రం సలార్‌ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సలార్‌ మూవీపై భారీగా హైప్‌ నెలకొన్నది. ఈ చిత్రం రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రూ.200 కోట్లకుపైగా బడ్జెట్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ నిర్మిచింది.

సలార్‌ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.65 వరకు, మల్టిఫ్లెక్స్‌లో రూ.100 వరకు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 28 వరకు టికెట్ల పెంపునకు అనుమతించింది.

సలార్‌ బెనిఫిట్‌ షో 20 థియేటర్లలో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఏపీలోనూ ధరలు పెంచుకునేందుకు సలార్ మూవీ టీమ్ అనుమతి కోరింది. ఇంకా అడ్వాన్స్‌డ్‌ టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించలేదు.

స‌లార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సలార్ మూవీలో ప్రభాస్ తన సత్తా చూపించబోతున్నాడు. సలార్ అడ్వాన్స్ టికెట్లు యూఎస్‌లో భారీగా అమ్ముడుపోతున్నాయి. సలార్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్. పృథ్వీరాజ్, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu