‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మరో స్టార్ హీరో..!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. దాదాపు రూ.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు సముద్ర ఖని ఓ కీలక పాత్రను చేస్తున్నారు. అంతకు మించి ఈ చిత్రం నుండి మరే సమాచారం బయటకు రావడం లేదు. ఇందులో హీరోయిన్లు ఎవరు అన్నది ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది.

ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో పుకారు బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గెస్ట్ క్యారెక్టర్ చేసే హీరో ఎవరో కాదు ‘ప్రభాస్’ అని చెప్తున్నారు. ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’ లో గెస్ట్ క్యారెక్టర్ చేస్తే.. ఆ సినిమాకు మరింత మైలేజ్ వస్తుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.