HomeTelugu Big Storiesప్రభాస్‌ 'సాహో' వరల్డ్‌ రికార్డ్‌!

ప్రభాస్‌ ‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

4 3

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సాహో’. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు సృష్టింస్తుంది. ఇప్పటికే భారత్‌లో మరో నటుడికి సాధ్యం కానీ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ప్రభాస్‌, సాహోతో వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

మొదటి వారాంతంలో అంతర్జాతీయ స్థాయి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జబితాలో సాహో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్‌ ఫ్యూరియస్‌ : హాబ్స్ అండ్ షా’ ఒక్కటే సాహో కన్నా ముందు ఉంది. ది లయన్ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ లాంటి సూపర్‌ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా సాహో తరువాతి స్థానాలతో సరిపెట్టుకోవటం విశేషం.

సెలవులు ముగియటంతో సాహో కలెక్షన్లు కాస్త స్లో అయినా ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాహో ముందు ముందు మరిన్ని రికార్డ్‌ల దిశగా దూసుకుపోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu