HomeTelugu Newsవెబ్‌ సిరీస్‌లో నటించనున్న ప్రకాశ్‌ రాజ్‌..

వెబ్‌ సిరీస్‌లో నటించనున్న ప్రకాశ్‌ రాజ్‌..

8

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వెబ్ సిరీస్ లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ పాత్రనైనా అవలీలగా చేసే ప్రకాశ్ రాజ్ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటి సారి. ఆయన నటించే వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తాను నటించే వెబ్ సిరీస్‌కు ప్రకాశ్ రాజ్ కథ రచనలో కూడా తన వంతు సాయం చేసినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో దేశంలోని పలుచోట్ల చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ వెబ్ సీరీస్ రూపొందుతోందని తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu