HomeTelugu News'పెట్ట' గా రజినీకాంత్..!

‘పెట్ట’ గా రజినీకాంత్..!

ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం టైటిల్‌ ప్రకటించారు .ఈ సినిమా రజనీకి 165 వ చిత్రం. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ చిత్రాన్నినిర్మిస్తోంది. ఈ చిత్రం తమిళ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ‘పెట్టా’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో తలైవా చాలా స్టైలిష్, మాస్‌గా కనిపించారు. ఆయన లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది.

8 6

దీంతో ఫ్యాన్స్‌ ట్విటర్‌లో తెగ లైక్‌లు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. రజనీ తాజాగా నటించిన రోబో 2 పాయింట్ ఓ సినిమా టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమీ జాక్సన్‌, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu