HomeTelugu News'ప్రేమమ్' ఆడియో విడుదలకు సిద్ధం!

‘ప్రేమమ్’ ఆడియో విడుదలకు సిద్ధం!

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ… ”ఈ చిత్రంలో ‘బ్యాంగ్ బ్యాంగ్ ‘ అంటూ సాగే మరో గీతం ను ఈ నెల 8న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ‘ఎవరే..’ అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న ‘ప్రేమమ్’ ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో, చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ‘దసరా పండుగ’ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని” తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu