తేజ కొత్త సినిమా ‘అలివేలు వెంకటరమణ’

దర్శకుడు తేజ .. కొత్తగా ఆలోచిస్తాడు. తన టైటిల్స్‌ ఎప్పుడూ డిఫరెంట్‌ ప్లాన్‌ చేస్తాడు ఈ డైరెక్టర్‌.. అలా రానాతో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చేసిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత రానాతోనే మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేస్తూనే, మరో వైపున గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయడానికి కూడా ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేయడానికి తేజ పనులను చేయిస్తున్నాడు. ఒక్కో సినిమాను తాపీగా తెరకెక్కించే తేజ, ఇలా ఒక్కసారిగా రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుండటం పట్ల ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుననాయి.