HomeTelugu Newsనక్సలైట్‌గా ప్రియమణి?

నక్సలైట్‌గా ప్రియమణి?

Untitled 1
రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

దాంతో ఆమె ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇంతవరకూ 70 శాతం చిత్రీకణ జరుపుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణిపై కూడా యాక్షన్ సీన్స్ వున్నాయట. ఇక ఆమె ‘నారప్ప’ సినిమాలోను హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu