HomeTelugu NewsPriyamani: మేము బాలీవుడ్‌ హీరోయిన్‌ల కంటే తక్కువ కాదు

Priyamani: మేము బాలీవుడ్‌ హీరోయిన్‌ల కంటే తక్కువ కాదు

Priyamani says we are not l Priyamani says we are not less than Bollywood heroines,Priyamani,Bollywood,Maidaan moviePriyamani latest interview: తమిళ నటి ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో పలు సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా తాను నటించిన ఆర్టికల్ 370 మూవీ గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నార్త్, సౌత్ అనే తేడాపై స్పందించింది.

సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. సాధారణంగా నార్త్ వెర్సెస్ సౌత్ అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడూ సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌లుగా నిలుస్తున్నాయి. దీంతో సౌత్‌ యాక్టర్స్‌ని కూడా బాలీవుడ్‌ మూవీల్లో భాగం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అక్కడి దర్శకులు. సౌత్ నటీనటులు, డైరెక్టర్లకు కూడా బాలీవుడ్‌లో బాగా డిమాండ్ పెరుగుతోంది.

తాజాగా ప్రియమణి కూడా ఆర్టికల్ 370 మూవీలో నటించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్ వాళ్లు కాస్త ఫెయిర్ గా ఉంటారన్న మాట నిజమే కానీ.. తాము కూడా ఎవరికీ తక్కువ కాదని ఆమె స్పష్టం చేసింది. “సౌత్ ఇండియా పాత్ర కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నామని కొన్నిసార్లు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు. తొందర్లోనే ఇందులో మార్పు వస్తుందని భావిస్తున్నాను.

Priyamani 1 Priyamani says we are not less than Bollywood heroines,Priyamani,Bollywood,Maidaan movie

మేము సౌత్ ఇండియా వాళ్లమే అయినా.. మేము హిందీలో అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు మేము చాలా అందంగా కూడా ఉంటాం. మా మేని ఛాయ బాలీవుడ్ వాళ్లంత ఫెయిర్ గా ఉండకపోవచ్చు కానీ అది పెద్ద విషయం కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులందరికీ భాష తెలుసు. వాళ్లు అనర్గళంగా మాట్లాడగలరు. గ్రామర్ తప్పిదాలు ఉన్నా భావోద్వేగాలు సరిగ్గా పలికించినంత వరకూ అదేమంత పెద్ద విషయం కాదు. ఇక నార్త్, సౌత్ అనేది ఉండకూడదు. మనమందరం ఎప్పుడూ ఇండియన్ యాక్టర్సే” అని ప్రియమణి స్పష్టం చేసింది.

ఆమె నటించిన బాలీవుడ్‌ మూవీ ‘మైదాన్‌’ సినిమా ఏప్రియల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్నాడు. భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. అమిత్‌శర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu