HomeTelugu Newsరానా చేతికి 'జెర్సీ' తమిళ రీమేక్‌?

రానా చేతికి ‘జెర్సీ’ తమిళ రీమేక్‌?

12 11తెలుగు హిట్‌ సినిమా ‘జెర్సీ’ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించబోతున్నారట. అయితే ఈ రీమేక్‌కు రానా నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై రానా ఇంకా స్పందించలేదు. మరోపక్క ‘జెర్సీ’ సినిమాను హిందీలోనూ రీమేక్‌ చేయబోతున్నారు. హిందీ హక్కుల్ని ప్రముఖ దర్శకులు అల్లు అరవింద్‌, దిల్‌రాజు సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో హీరో పాత్ర కోసం షాహిద్‌ కపూర్‌ను కలిసినట్లు ఇటీవల వదంతులు వచ్చాయి.

‘జెర్సీ’లో నాని హీరోగా నటించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu