HomeTelugu Big Storiesటాలీవుడ్ లో మరో విషాదం సీనియర్ నిర్మాత మృతి

టాలీవుడ్ లో మరో విషాదం సీనియర్ నిర్మాత మృతి

Producer Kodali Bosubabu Passed Away At 66

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు గుండె పోటుతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. దాసరి భార్య దివంగత సినీ కార్మిక నేత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. మొదట్లో దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన బోసుబాబు… ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు.

అక్కినేని నాగేశ్వరరావుతో రాగదీపం, నాగేశ్వరరావు, కృష్ణలతో ఊరంతా సంక్రాంతి, కృష్ణతో ప్రజాప్రతినిధి, శోభన్ బాబుతో జీవనరాగం, దాసరి నారాయణరావుతో పోలీస్ వెంకటస్వామి సినిమాలను నిర్మించారు. బోసుబాబుకు భార్య, నలుగులు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu