హారర్ సినిమాలో యంగ్ హీరో!

ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. వరుస హారర్ సినిమాలు వస్తుండడంతో టాలీవుడ్ కి దయ్యం పట్టిందా అంటూ.. రకరకాల ఆర్టికల్స్ కూడా రాశారు. దర్శకనిర్మాతలకు ఇదొక సేఫ్ జోనర్ గా మారింది. ఈ జోనర్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రేక్షకులు కూడా హారర్ తో కూడిన కామెడీ సినిమాలకే వోటేస్తున్నారు. హీరోలు కూడా ఇటువంటి  సినిమాల్లో నటించడానికి మక్కువ చూపుతున్నారు. నాగార్జున లాంటి స్టార్ హీరో సైతం ‘రాజుగారిగది’ సీక్వెల్ లో నటించడానికి సిద్ధపడ్డాడు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘ఎక్కడకిపోతావు చిన్నవాడా’ సినిమా కూడా హారర్, కామెడీ సినిమానే.. ఈ సినిమా నిఖిల్ కి మరో హిట్ తెచ్చిపెట్టింది.

ఇప్పుడు మరో యంగ్ హీరో హారర్ సినిమాలో నటించడానికి రెడీ అయిపోతున్నాడు. పెళ్ళిచూపులు చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా తన టాలెంట్ నిరూపించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ద్వారకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత విజయ్ యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోన్న హారర్ సినిమాలో నటించడానికి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా కొత్త కథానాయికను పరిచయం చేయనున్నారు.