పవన్‌ కల్యాణ్ హీరోయిన్‌పై క్లారిటీ ఇచ్చిన హరీష్‌


టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో వైపు రాజకీయాల్లో కూడా పవన్ చురుకు గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ గా వాస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడిగా అందాలభామ పూజ హెగ్డేను ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. తర్వాత పూజ స్థానం లో కాజల్ ను సెలక్ట్ చేసారనే పుకార్లు హల్‌ఛల్ చేసాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలపై దర్శకుడు హరీష్ క్లారిటీ ఇచ్చేసాడు. తన సినిమాలో పవన్ జోడి గురించి ఇంకా ఎవరిని అనుకోలేదని అనుకున్నప్పుడు తప్పకుండా వెల్లడిస్తామని తెలియజేసాడు. అయితే చుడాలి మరి పవన్-హరీష్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి.