HomeTelugu Trendingపులి - మేక: వెబ్ సిరీస్ ప్రారంభం

పులి – మేక: వెబ్ సిరీస్ ప్రారంభం

Puli meka web series launch
లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘పులి – మేక’ వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5, సినీ రచయిత కోన వెంకట్ కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ ఈ వెబ్ సిరీస్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితర టాలీవుడ్ స్టార్లు ఉండడంతో దీనిపై అత్యంత ఆసక్తి కలుగుతోంది. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమా కి దర్శకత్వం వహించిన కె.చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.

క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక’ వెబ్ సిరీస్ పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ విచ్చేశారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu