HomeTelugu Trendingఅనారోగ్యంతో బాధపడుతున్న పునర్నవి

అనారోగ్యంతో బాధపడుతున్న పునర్నవి

punarnavi bhupalam
నటి పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ప్రేక్షకులను మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న సినిమాల్లో మాత్రం ఆమె కనిపించింది. తాజాగా ఆమె తన ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ ను చెప్పింది. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడించింది.

గత కొన్ని రోజులుగా తాను ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నట్టు ఆమె తెలిపింది. కొత్త సంవత్సరాన్ని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నానని బాధాకరమైన విషయాన్ని వెల్లడించింది. తాను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరి సారి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ మేరకు భార్గవి పెట్టిన మెసేజ్ ఆమె అభిమానులను చాలా బాధకు గురి చేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu