HomeTelugu Trendingబిగ్‌బాస్‌ నుంచి పునర్నవి ఔట్.. వెళ్లేముందు శృంగార రసం

బిగ్‌బాస్‌ నుంచి పునర్నవి ఔట్.. వెళ్లేముందు శృంగార రసం

8 6
బిగ్‌బాస్ తెలుగు-3లో నవరాత్రి సందర్భంగా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో ఆదివారం(అక్టోబర్ 6) హోస్ట్ నాగార్జున నవరసాలు పలికించారు. వారితో నాగార్జున ముచ్చటిస్తూ.. నవరాత్రి అంటేనే నవరసాలు.. ఈ నవరసాలను మాకు చూపించాలని ఒక్కొక్కరూ ఒక్కో రసాన్ని చూపించాలని వారితో ఆటాడించాడు. దీనికి మార్కులు కూడా ఉంటాయని అనడంతో పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయారు కంటెస్టెంట్స్.

ముందుగా వరుణ్ సందేశ్‌కి శాంతం రసం ఇచ్చి పాట ప్లే చేశారు. వరుణ్ బాగానే కష్టపడ్డాడు గానీ.. ఇది శాంతంలా లేదు.. పెద్ద ఫ్రూట్‌లా కనిపించావ్ అన్నాడు నాగార్జున. పునర్నవికి శృంగార రసం ఇవ్వగా పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఇచ్చింది. పునర్నవి పర్శనాలిటీకి తగ్గట్టుగానే శృంగార రసం పండించాలని టాస్క్ ఇచ్చారు నాగ్. ఇక గులాబీ రంగు
లంగా ఓణీతో వయ్యారాలు ఒలకబోస్తూ శృంగార రసాన్ని ఒలకబోస్తూ అదరగొట్టింది. సిగ్గేస్తోంది.. నిను చూస్తుంటే.. సిగ్గేస్తోంది నిను చూస్తుంటే అంటూ వయ్యారాలను ఒలకబోసింది. ఆమె శృంగార రసాన్ని విరివిగా పండిస్తుంటే.. తట్టుకోవడం రాహుల్‌కి చాలా కష్టమైంది. నాగార్జున సైతం రెప్పవేయకుండా పున్నూ శృంగార రసాన్ని
ఆస్వాదించారు. అనంతరం శివజ్యోతికి తగ్గట్టుగా కరుణ రసాన్ని అప్పగించారు. రంగంలోకి దిగిన శివజ్యోతి ఆడజన్మకు ఎన్ని శోకాలో… అంటూ జీవించేసింది. దీంతో నాగార్జునతో పాటు ఇంటి సభ్యులతో బెస్ట్ మార్కులను కొట్టేసింది.

అనుకున్నట్లుగానే ఆదివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి పునర్నవి భూపాలం ఎలిమినేట్ అయింది. నామినేషన్‌లో ఉన్న వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్ట, పునర్నవి భూపాలంలో పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. పునర్నవి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆమె ఫ్రెండ్ రాహుల్ జీర్ణించుకోలేకపోయాడు. స్టేజిపైకి వెళ్లిన పునర్నవి.. రాహుల్ వెళ్లిపోతున్నానని అనగానే.. రాహుల్ తన హృదయం లోపల నుంచి తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపులేకపోయాడు. ఆమె కోసం వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో మిగతా హౌస్ మేట్స్ అతడిని ఓదార్చారు.

హౌస్ నుంచి బిగ్‌బాస్ స్టేజిపైకి వెళ్లిన పునర్నవికి చివరిసారి టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటిలో ఉన్న వారిలో ఎవరికి హగ్ ఇస్తావు? ఎవరికి పంచ్ ఇస్తావు.? అని ప్రశ్నించారు. అందులో మహేష్, బాబా భాస్కర్‌కు పంచ్ ఇచ్చిన పునర్నవి… వితిక, వరుణ్, అలీకి మాత్రం హగ్ ఇచ్చింది. ఇక రాహుల్ ‘నా వేస్ట్ ఫెల్లో’ అంటూ బిగ్‌హగ్ ఇచ్చింది పున్ను. టాస్క్‌లపై దృష్టి పెట్టాలని.. ఓవర్ ఎక్సైట్ కావొద్దని రాహుల్‌కు సూచించింది. కోతి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఆడమని.. ఏమైనా అవసరముంటే వరుణ్, వితికతో చర్చించాలని సలహాలు ఇచ్చింది పునర్నవి. ఇక ఇంట్లో బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ రెజా మాస్టర్‌గా ఉండాలని బిగ్ బాంబ్ వేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu