HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ కోసం గోవా వెళుతున్న పూరి

విజయ్‌ దేవరకొండ కోసం గోవా వెళుతున్న పూరి

3 17డైరెక్టర్‌ పూరి జగన్నాథ్.. చాలా వేగంగా కథలను తయారు చేయడంలోను .. స్క్రిప్ట్ ను పూర్తి చేయడంలోను సిద్ధహస్తుడు. తన కొత్త సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి ఆయన ఎక్కువగా బ్యాంకాక్ వెళుతుంటాడు. అప్పుడప్పుడు గోవా కూడా వెళుతుంటాడు. బ్యాంకాక్ తరువాత ఆయనకి బాగా నచ్చిన ప్రదేశం గోవానే. అందువల్లనే అక్కడ తన సినిమాకి సంబంధించిన సీన్ ఒకటైనా తీస్తుంటాడు.

ఇప్పుడు తన తాజా చిత్రం కోసం ఆయన గోవా వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడు. బౌండ్ స్క్రిప్ట్ తోనే ఆయన అక్కడి నుంచి తిరిగి వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ చేస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా పూర్తికాగానే, పూరి చిత్రం ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu