HomeTelugu Trendingక్రేజీ కాంబినేషన్‌లో విజయ్‌ దేవరకొండ!

క్రేజీ కాంబినేషన్‌లో విజయ్‌ దేవరకొండ!

2 9డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరీ కనెక్స్ట్‌ సోమవారం ప్రకటించింది. క్రేజీ కాంబినేషన్‌లో మీ ముందుకు సినిమా రాబోతోందంటూ.. పూరీ, విజయ్‌, ఛార్మి కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ట్వీట్‌ చేసింది. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ, లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉందని, దీన్ని ఊహించలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

పూరీ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తో మంచి హిట్‌ అందుకున్నారు. విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ తో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న ‘హీరో’ లో విజయ్‌ నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్‌ జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా చిత్ర బృందం స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu