HomeTelugu Trendingపూరీతో పవన్‌ కళ్యాణ్ సినిమా..!

పూరీతో పవన్‌ కళ్యాణ్ సినిమా..!

3 27
టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘పింక్’ తెలుగు రీమేక్ ద్వారా ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ‘దిల్’ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడనీ, త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

దర్శకుడు క్రిష్ కూడా పవన్ కల్యాణ్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ నగర్లో మరో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి ఒక సినిమా చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం. ఆల్రెడీ పవన్ ను పూరి కలుసుకుని కథ చెప్పాడనీ, ఆ ప్రాజెక్టు చేస్తానని పవన్ మాటిచ్చాడని చెబుతున్నారు. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేసిన తరువాత, పవన్ తో పూరి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu