HomeTelugu Big Stories'రాధే శ్యామ్‌' టీజర్‌ వచ్చేస్తుంది

‘రాధే శ్యామ్‌’ టీజర్‌ వచ్చేస్తుంది

Radheshyam Movie Teaser on
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన పాన్-ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

‘విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ గురించి తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి’ అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రభాస్ తన పోస్ట్‌లో #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

ఈసినిమా 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న’రాధే శ్యామ్’ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

Prabhas Radheshyam Teaser Release on 23rd oct

Recent Articles English

Gallery

Recent Articles Telugu