బాలయ్య వేడుక పోలిటికల్ సభ!

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో వేడుకను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మధ్య సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రాజకీయనాయకులు కనిపించడం సాధారణ విషయంగా మారింది. దృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మంత్రి కేటీఆర్ హాజరయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారని సమాచారం. ఆయనతో పాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
 
రాజకీయనాయకులు ఇలాంటి సినిమా ఫంక్షన్స్ ను వచ్చినా.. అక్కడ రాజకీయ వాతావరణం కనిపించకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇప్పుడు శాతకర్ణి ఫంక్షన్ లో మాత్రం తెలుగు దేశం పార్టీ హడావిడి చేయనుందని టాక్. ఇప్పటికీ టీడీపీ నేతలు తిరుపతిలో మీటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారట.
 
ఈ సినిమా ఫంక్షన్ ను ఓ పోలిటికల్ సభగా మార్చడానికి తగు ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తల్ని ఈ వేడుకకు తరలించనున్నారు. చంద్రబాబు, బాలయ్య లకు సంబంధించి భారీ కటౌట్లను పెట్టనున్నారు. బాలయ్య కూడా టీడీపీ ఎమ్మెల్యే గనుక ఈ సభలో రాజకీయ భజన తప్పదని మాట్లాడుకుంటున్నారు.