HomeTelugu Trendingప్రభుత్వానికి రాఘవేంద్రరావు విజప్తి వీడియో వైరల్

ప్రభుత్వానికి రాఘవేంద్రరావు విజప్తి వీడియో వైరల్

raghavendra rao request to

తెలుగు సినిమా ఖ్యాతిని యావత్‌ ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు గారు ఒకరు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం ఇటీవలే ఆయన పేరు మీద 100 రూపాయల నాణాన్ని విడుదల చేసిందని తెలిసిందే. దీంతో తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నాకు దైవసమానులైన నందమూరి తారకరామారావు పేరుతో 100 రూపాయల నాణాన్ని భారత ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్ట్స్‌ త్వరలోనే ఆయనకు భారతప్రభుత్వం భారతరత్న బిరుదు ఇస్తే.. తెలుగు జాతి నిజంగా గర్వించదగిన రోజు అవుతుంది. ఆ పనిని కూడా అందరూ కలిసి త్వరగా పూర్తి చేస్తారని నమ్ముతూ.. మీ రాఘవేంద్రరావు.. అంటూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu