HomeTelugu Trendingరాజ్‌ తరుణ్ ‘అనుభవించు రాజా’ !

రాజ్‌ తరుణ్ ‘అనుభవించు రాజా’ !

Raj tharun new movie anubha

టాలీవుడ్‌లో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్‌ తరుణ్‌. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని రూపొందించిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మోడల్ కాషిశ్‌ ఖాన్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేయబోతున్నట్టు టాక్‌. గత ఎడాది కరోనా టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీలో విడుదలైంది. ఈ ఎడాది మార్చిలో ‘పవర్ ప్లే’ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అయితే… రాజ్ తరుణ్ తాజాగా మూవీ ‘స్టాండప్ రాహుల్’కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu