HomeTelugu Trendingప్రభాస్‌ 'ఆదిపురుష్‌' పై రాజమౌళి కామెంట్స్‌..

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ పై రాజమౌళి కామెంట్స్‌..

Rajamouli comments on prabhయంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే టైటిల్ పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా ప్రభాస్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌ ఆదిపురుష్ పోస్టర్‌పై స్పందిస్తూ.. ఆ పోస్టర్‌ను తాను చాలా రోజుల క్రితమే చూశానని చెప్పారు.

ఆదిపురుష్ సినిమా రావడానికి ఇదే సరైన సమయమని, ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవలే రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిందని చెప్పారు. భారత దేశం మొత్తం ఇప్పుడు రాముడి గురించి చర్చ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుందని ఆయన చెప్పారు. ఆదిపురుష్ సినిమాతో హీరో ప్రభాస్ స్థాయి మరింత పెరుగుతుందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu